నెల్లూరు జిల్లాలో నాటకీయ పరిణామాలు
posted on Apr 15, 2025 5:10PM
.webp)
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై రాజకీయ వైరంతో ప్రత్యర్థి పెట్టించిన 17 కేసులకు సర్వేపల్లి శాసన సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చట్టాన్ని గౌరవించి కోర్టుకు హాజరౌతుంటే.. వీటికి కారణంగా చెబుతున్న ఆయన ప్రత్యర్థి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరారీలో ఉన్నారు. ఆయనపై లుకౌట్ నోటీసులు ఇచ్చి పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. సోమిరెడ్డి నేడు కూడా ఆనందయ్య కరోనా కేసు విచారణకు హాజరయ్యారు.
కాకాణి పరారీపై సోమిరెడ్డి మంగళవారం (ఏప్రిల్ 15) ఆక్షేపణలు తెలిపారు. గతంలో కాకాణి వాడిన భాషపైనా, తిట్లపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ధైర్యం ఉంటే పోలీసు నోటీసులు తీసుకుని విచారణకు హాజరు కావాలని సవాల్ చేశారు. కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఆరోపణలు చేశారు.