జగన్‌కి ఓటు వేస్తే... వీటికి ఒప్పుకున్నట్లే!

ఈ ఎన్నికలలో ఎవరైనా ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్ ఓటరు ఈ క్రింది విషయాలను ఒప్పుకున్నట్లే అని సోషల్ మీడియాలో ఒక బాధ్యతగల పౌరుడు స్పందించాడు. నిప్పులాంటి నిజాలను గుర్తు చేశాడు. మీరు ఆంధ్రప్రదేశ్ ఓటరా? మీ మనసులో ఏ మూలనైనా జగన్‌కి ఓటు వేయాలన్న ప్రమాదకరమైన ఆలోచన వుందా? అయితే ఆ బాధ్యత గల పౌరుడు చేస్తున్న హెచ్చరికలు చూడండి.. ఆలోచించి ఓటు వేయండి. ఈసారి జగన్‌కి ఓటు వేస్తే....

* మాకు డెవలప్‌మెంట్ అక్కర్లేదు అని ఒప్పుకున్నట్లే...
* మా రాష్ట్రానికి రాజధాని అవసరం లేదని ఒప్పుకున్నట్లే....
* మా ఆస్తులు మీ దగ్గర తాకట్టు పెట్టుకోవచ్చని ఒప్పుకున్నట్లే...
* పోలవరం ప్రాజెక్టు కట్టనవసరం లేదని ఒప్పుకున్నట్లే....
* పరిశ్రమలు అవసరం లేదని ఒప్పుకున్నట్లే.....
* మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా పర్లేదు అని ఒప్పుకున్నట్లే...
* కడప స్టీల్ ప్లాంట్ అవసరం లేదని ఒప్పుకున్నట్లే....
* ప్రత్యేక హోదా అనేది ఒక ముగిసిన అధ్యాయం అని ఒప్పుకున్నట్లే....
* కేంద్రం నుండి మాకు ఒక్క రూపాయి రాకపోయినా పర్లేదు మేము ఊడిగం చేస్తాం అని ఒప్పుకున్నట్లే.....
* సిపిఎస్ అవసరమే లేదు మీరు ఎంతిస్తే అంత అదే మాకు పదివేలు అని ఒప్పుకున్నట్లే....
* పీఆర్సీలు, అరియర్స్ అవసరం లేదు.. మీకు బుద్ధి పుట్టినప్పుడు ఇవ్వండి అని ఒప్పుకున్నట్లే.....
* రోడ్లు మాకు అక్కర్లేదు మాకు ఇలాగే బాగున్నాయి అని ఒప్పుకున్నట్లే....
* రైల్వే జోన్ అవసరం లేదని ఒప్పుకున్నట్లే.....
* మా రాష్ట్రాన్ని పులివెందుల తోడేళ్ళకు రాసిచ్చేశాం అని ఒప్పుకున్నట్లే....
* మాకు మంచి మద్యం వద్దు, ఇలా బూమ్ బూమ్ లాంటి కల్తీ మద్యం కావాలని ఒప్పుకున్నట్లే....
* మేము స్వేచ్ఛగా మాకు కావలసినది అడగం, మీ కింద బానిసలాగా బతుకుతాం అని ఒప్పుకున్నట్లే....
* రాష్ట్రంలో మీకు నచ్చినవి తాకట్టు పెట్టుకోండి అని ఒప్పుకున్నట్లే....
* కావలసిన అప్పులు చేసుకొమ్మని ఒప్పుకున్నట్లే....
* ప్రజా సమస్యల మీద కాకుండా ప్రశ్నించే వారిని అరెస్ట్ చేసుకొమ్మని ఒప్పుకున్నట్లే....
* ఇసుక దందా చేసుకొమ్మని ఒప్పుకున్నట్టే....
* డిఎస్సీ మాకు అవసరం లేదని ఒప్పుకున్నట్లే.....
* మా బతుకులకి 5 వేల వాలంటీర్ జాబులు చాలా ఎక్కువ అని ఒప్పుకున్నట్లే...
* మిగతా నీటి ప్రాజెక్టులు కట్టకపోయినా పర్వాలేదు అని ఒప్పుకున్నట్టే....
* మీ ఇష్టం వచ్చినట్లు కబ్జాలు చేసుకోండి, మేమేమీ అనం అని ఒప్పుకున్నట్లే....
* ఎంతమందినైనా హత్య చేసుకోండి మేం ఏమీ అడగమని ఒప్పుకున్నట్లే...