తుంటి గాయానికి చికిత్స పొందుతూ యశోదా అస్పత్రిలో ఉన్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనను చూసేందుకు ఎవరూ రావద్దని అంటున్నారు. ఈ మేరకు ఆస్పత్రి బెడ్ మీద నుంచే ఆయన ఒక వీడియో విడుదల చేశారు.
ఇన్ ఫెక్షన్ భయంతో డాక్టర్లు తనను బయటకు పంపడం లేదనీ, త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తాననీ, అంత వరకూ తనను చూసేందుకు ఎవరూ ఆస్పత్రికి రావద్దనీ ఆయనా వీడియోలో విజ్ణప్తి చేశారు. యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న కేసీఆర్ ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు తరలి వస్తుండటంతో కేసీఆర్ ఈ విజ్ణప్తి చేశారు.
తాను కోలుకుంటున్నాననీ, త్వరలోనే పూర్తిగా కోలుకుని మీ మధ్యకు వస్తాననీ చెప్పారు. అప్పటి వరకూ యశోద దవాఖానకు ఎవరూ రావద్దని కోరారు. ఈ ఆస్పత్రిలో తనతో పాటు వందల మంది పేషెంట్లు ఉన్నారనీ, వారికి ఎవరికీ మన వల్ల ఇబ్బంది కలగొద్దనే తానీ విజ్ణప్తి చేస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు.