'దొంగాట' షార్ట్ రివ్యూ

 

కామెడీని మన ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అందులో డౌటే లేదు. అదే కామెడీకి, కొంచెం క్రైమ్, కొంచెం సెంటిమెంట్ కలిపితే బండి లాగించేసినట్టే. ఇలా అన్ని కోణాలు కలుపుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాయే ఈ దొంగాట. ఈ దొంగాట షార్ట్ రివ్యూ చూద్దాం.

కథ ఏంటంటే:

శ్రుతి (మంచు ల‌క్ష్మి) ఓ స్టార్‌. ఆమె తల్లి ప‌విత్ర‌ శ్రుతికి కావ‌ల్సిన అవసరాలన్నిద‌గ్గ‌రుండి చూసుకొంటుంటుంది. అయితే  వెంక‌ట్ (అడ‌వి శేష్‌), విజ్జు (మ‌ధు) కాటం రాజు (ప్ర‌భాక‌ర్‌) శ్రుతిని కిడ్నాప్ చేయ‌డానికి ప్లాన్ చేస్తారు. పథకం ప్రకారం పుట్టిన రోజు పార్టీ నుండి  శ్రుతిని ఎత్తుకొచ్చేసి ప‌ది కోట్లు డిమాండ్ చేస్తారు. శృతి కిడ్నాప్ కేసు డీల్ చేయ‌డానికి రంగంలోకి దిగుతాడు ప్రైవేట్ డిటెక్టీవ్ బ్ర‌హ్మీ (బ్ర‌హ్మానందం). అయితే కిడ్నాప‌ర్లు శ్రుతిని బ్ర‌హ్మీ ఇంట్లోనే దాచి పెడ‌తారు. ఇదిలా ఉండగా కిడ్నాపర్లు డిమాండ్ చేసిన ప‌ది కోట్లూ వారి చేతిలో ప‌డిపోతున్నాయ్ అన‌గా.. అప్పుడు క‌థ‌లో ఓ కొత్త ట్విస్టు వస్తుంది. ఆ ట్విస్ట్ ఏంటీ? ప‌ది కోట్లు కిడ్నాప‌ర్ల‌కు అందాయా? ఎవరు ఎవరితో 'దొంగాట' ఆడారు? అనేదే ఈ సినిమా క‌థ‌.

తారాగణం: మంచులక్ష్మీ, అడవి శేషు, మధు, ప్రభాకర్, బ్రహ్మానందం తదితరులు.