ట్రంప్ కు అవంటే చాలా భయమట..?
posted on Apr 24, 2017 11:09AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మాటలతో... పనులతో అందరిని భయపెడుతారన్న సంగతి అందరికి తెలిసిందే. అలాంటి ట్రంప్ ను భయపెట్టేవి కూడా ఉన్నాయి. అదేంటే తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇంతకీ ట్రంప్ దేనికి భయపడతారబ్బా అనుకుంటున్నారా.. ట్రంప్ కు మెట్లన్నా.. ఏటవాలు ప్రదేశాలన్నా.. విపరీతమైన భయమట. అందుకే ఆయన పర్యటనలో భాగంగా ఎక్కడా మెట్లు ఎక్కే అవకాశం లేకుండా చేస్తున్నారట. ట్రంప్ బ్రిటన్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన ఏర్పాట్లను చూస్తున్న వారు గ్రౌండ్ ఫ్లోర్లలోనే కార్యక్రమ వేదికల ఏర్పాటుకు యత్నిస్తున్నారట. ఎక్కడా మెట్లు ఎక్కే అవసరం రాకుండా ప్రణాళికలు రచిస్తున్నారట బ్రిటన్ అధికారులు.
కాగా అక్టోబర్‌లో ట్రంప్ బ్రిటన్‌లో పర్యటించనున్నారు. ఆయన గౌరవార్థం బకింగ్‌హమ్ ప్యాలెస్‌లో రాత్రి విందును ఏర్పాటు చేయనున్నారు. ఎలిజబెత్ రాణి-2ని ఆయన కలువనున్నారు.. బల్మొరల్ క్యాస్టల్‌ను సందర్శించనున్నారు.