తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (మే 1)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఆరు కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం ( ఏప్రిల్ 30) శ్రీవారిని మొత్తం 72 వేల 310 మంది దర్శించుకున్నారు.

వారిలో 28వేల 731 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల59 లక్సల రూపాయలు వచ్చింది.