తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (మే6) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 19 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఆదివారం (మే 5) శ్రీవారిని మొత్తం 81 వేల 927 మంది దర్శించుకున్నారు.

వారిలో 21 వేల 196 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 28 లక్షల రూపాయలు వచ్చింది.