తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు

తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ, అసౌకర్యం లేకుండా ప్రశాంతంగా వైకుంఠద్వార దర్శనాలు చేసుకునేందుకు వీలుగా టీటీడీ అన్ని ఏర్పాట్లూ చేసింది.

బుధవారం తిరుమలలో మొత్తం 71 వేల 417 మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. వారిలో 19 వేల 396 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 42లక్షల రూపాయలు వచచింది.