శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
posted on May 22, 2024 8:48AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవలు కావడంతో భక్తుల రద్దీ పెరుగుతోంది. సాధారణంగా వారాంతాలతో పోలిస్తే మిగిలిన రోజులలో భక్తుల రద్దీ ఒకింత తక్కువగా ఉంటుంది.
అయితే ఇప్పుడు మాత్రం వేసవి సెలవులు కారణంగా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తున్నారు. బుధవారం(మే22) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ టీబీసీ వరకూ సాగింది.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక మంగళవారం (మే21) శ్రీవారిని మొత్తం 80వేల774 మంది దర్శించుకున్నారు.
వారిలో 35వేల726 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 76 వేల రూపాయలు వచ్చింది.