తెలంగాణ సంపద, వనరుల రక్షణకు ఓటెత్తండి.. మల్లు పిలుపు
posted on May 13, 2024 3:46PM
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం జిల్లా మధిరలో తన ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన ఆ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సంపద, వనరుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఓటునే ఆయుధంగా వాడుకోవాలన్నారు.
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. లేకుంటే ప్రజాస్వామ్య పునాదులు, లౌకిక వాదం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఇలా ఉండగా తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ సజావుగా సాగుతోంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం పోలింగ్ మందకొడిగా సాగుతోంది. నగర ఓటర్లు ఓటు హక్కు వినియోగంపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదు.
మరో వైపు షేక్ పేటలో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా షేక్ పేట్ డివిజన్ లో దాదాపు 3 వేల ఓట్లను గల్లంతయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే వారంతా ఓటు వేశారు. అప్పుడు ఉన్న ఓటు ఇప్పుడు తొలగించడమేమిటని షేక్ పేట్ వాసులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బీజేపీకి వ్యతిరే కంగా అధికారులు ఒక వర్గానికి చెందిన వారి ఓట్లను మాత్రమే తొలగించారని ఆరోపి స్తున్నారు. వారం కిందట ఓటరు స్లిప్పులను పంచి ఇప్పుడు జాబితాలో పేరు లేదంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి షేక్ పేట్ కు వచ్చారు. ఓట్ల గల్లంతుపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘాని కి కూడా ఫిర్యాదు చేయనున్నామని కిషన్ రెడ్డి చెప్పారు.