సంధ్య థియేటర్ తొక్కిసలాట.. ప్రభుత్వానికి NHRC నోటీసు
posted on Aug 6, 2025 4:09PM

తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్మి రామకృష్ణారావుకి జాతీయ మానవ హక్కుల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దర్యాప్తు తీరుపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మృతురాలి కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చింది. ఈ ఘటనపై ఆరు వారాల్లో నివేదిక సమర్పించాలని నోటీసుల్లో పేర్కొంది. ముందే చర్యలు తీసుకోని ఉంటే తొక్కిసలాట ఘటన జరిగేది కాదు అని పేర్కొంది. నిష్పక్షపాతంగా దర్యాప్తు పూర్తిచేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ని ఆదేశించింది.
గత ఏడాది పుష్ప -2 మూవీ ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్యా థియేటర్‌లో ప్రదర్శించారు. అయితే అదే సమయంలో థియేటర్ వద్దకు హీరో అల్లు అర్జున్ రావడంతో ఆయనను చూడటానికి భారీగా ఫ్యాన్స్ చేరారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సినిమా చూడటానికి వచ్చిన రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై రేవతి కుటుంబానికి పుష్ప మూవీ టీమ్ పరిహారం అందజేసింది. గతంలో ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతీ తెలిసిందే.