టీమిండియా క్రికెటర్ రహానే తండ్రి అరెస్ట్‌

 

సిక్సర్లు, ఫోర్లతో స్టేడియంలో విధ్వంసం సృష్టించే అజింక్య రహానే పేరు.. ఇప్పుడు భారత క్రికెట్ అభిమానుల్లో మారుమోగిపోతోంది. సెహ్వాగ్ తర్వాత రహానే ఆటను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలా అతను పేరు సంపాదించుకుంటుండగా.. రహానే తండ్రి మాత్రం ఆ కొడుక్కి చెడ్డ పేరు తీసుకువచ్చే పని ఒకటి చేశారు. శుక్రవారం ఉదయం తన కారులో వెళుతున్న రహానే తండ్రి.. మధుకర్ బాబురావు ఒక మహిళను ఢీకొట్టి ఆమె మృతికి కారణం అవ్వడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. రహానే కుటుంబం హ్యుండయ్ కారులో కొల్హాపూర్ నుంచి వెళుతుండగా.. 4వ నెంబర్ జాతీయ రహదారిపై కంగల్ సమీపంలో అదుపుతప్పి ఒక మహిళను ఢీకొట్టింది. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించగా.. ఆమె చికిత్స పొందుతూ మరణించింది. కారు నెంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఆ సమయంలో డ్రైవింగ్‌లో ఉన్న రహానే తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు రహానే తండ్రి మధుకర్‌ రహానేపై 304ఎ, 337, 338, 184 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.