పెరుగుతున్న కరోనా మరణాలు

భారత దేశంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్యతో పాటు మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగు తోంది. గురువారం ఒక్క రోజే 1,174 మంది కరోనాతో మరణించడం ఆందోళనకరం. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా  96 వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ రికవరీ రేట్ మిగతా దేశాలకంటే మన దగ్గర ఆశాజనకంగా ఉండేది. అయితే గత రెండు మూడు రోజులుగా మరణాల సంఖ్య కూడా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు రావడం, వందల సంఖ్యలో మరణాలు సంభవించడంతో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం మన దేశంలో ఉన్న మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,14,678. వీరిలో 10,17,754 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  కరోనాతో మరణించిన వారి సంఖ్య 84,372గా నమోదు అయ్యింది. రోజూ దాదాపు వెయ్యి మరణాలు సంభవిస్తున్నాయి.
 
ఇక తెలుగురాష్ట్రాల్లోనూ కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. మరణాల సంఖ్య చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే  ఐదు వేలు దాటింది. తెలంగాణలోనూ వెయ్యి మందికి పైగా కరోనాతో చనిపోయారు. అయితే ప్రభుత్వం సరైన లెక్కలను చెప్పితే మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది