శ్రీశైలంలో కానిస్టేబుల్ ఆత్మహత్య

ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రం శ్రీశైలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శంకర్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేనుకున్నారు. మృతుడు శంకర్ శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ విశ్రాంతి గదిలో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే సీఐ ప్రసాద్ రావు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు స్పందిస్తూ... శ్రీశైలంకు వెళ్తున్నానని, అక్కడకు వెళ్లిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తానని చెప్పారు. శంకర్ సూసైడ్ తో అక్కడ విషాదకర వాతావరణం నెలకొంది.
 మృతుడు రక్తపుమడుగులో పడి ఉన్న ఘటనను పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలయలేదు.
సమాచారం అందుకున్న సీఐ ప్రసాద్‌రావు అక్కడికి చేరుకొని ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం విచారణ చేస్తున్నారు. ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు శ్రీశైలం చేరుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.