సీఎం రేవంత్‌ భాష మార్చుకోవాలి.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

 

సీఎం రేవంత్‌రెడ్డిపై మనుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి తన భాష  హావభావాలను మార్చుకోవాలని ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు చెప్పాలని తెలిపారు. రేవంత్ రెడ్డి గంటలు గంటలు మాట్లాడకుండా.. ఆ శ్రద్ధ పని మీద చూపించాలని హితవు పలికారు. 

ఇంకో మూడున్నర ఏళ్లు ఆయనే సీఎం.. ఆ తర్వాత ఎవరు అనేది అధిష్టానం, ప్రజలు నిర్ణయిస్తారని షాకింగ్ కామెంట్స్ చేశారు. మంత్రి పదవిపై తనకు అధిష్ఠానం హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.  రేవంత్ వెనుకాల 20 మంది ఆంధ్రా పెట్టుబ‌డిదారులు ఉన్నార‌ని రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu