బెంగళూరుకు వెళ్ళిన చంద్రబాబు
posted on Nov 10, 2014 10:21AM

ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగించడం సమర్థుడైన ఏ ముఖ్యమంత్రి అయినా చేసే పని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సమావేశమయ్యేందుకు సోమవారం నాడు బెంగళూరుకు వెళ్ళారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆయన బెంగళూరుకు వెళ్ళారు. బెంగళూరు విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత, అనంతపురం జిల్లా ప్రజా ప్రతినిధులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. బెంగుళూరులో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ భేటీలో రెండు రాష్ట్రాలకు చెందిన నీటి పారుదల శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. రాయలసీమ తాగునీటి కోసం తుంగభద్ర నుంచి నీటి మళ్ళింపు మీద రెండు రాష్ట్రాల ప్రతినిధులు చర్చించారు.