జాతీయగీతం వేళ ఫోన్ మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి.. ఆఖరికి క్షమాపణలు..
posted on May 28, 2016 4:53PM
.png)
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణం స్వీకారం చేసేశారు. ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన ఓ మాజీ ముఖ్యమంత్రిగారు మాత్రం అడ్డంగా బుక్కయ్యారు. అసలు సంగతేంటంటే.. జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా కూడా దీదీ ప్రమాణ స్వీకారానికి వచ్చారు. ఆసమయంలో జాతీయ గీతాలాపన సమయంలో ఫోన్ లో మాట్లాడారు. అంతే ఇది కాస్త కెమెరా కంటికి చిక్కింది. దీంతో ఆయన వ్యవహరించిన తీరుపై వివాదం రేగుతోంది. ఇక ఆఖరికి అబ్దుల్లా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఆసమయంలో ఎమర్జెన్సీ కాల్ వచ్చింది అందుకే మాట్లాడానని.. జాతీయ గీతం సమయంలో ఎలా వ్యవహరించాలో తనకు తెలుసని, తాను నిలబడే ఉన్నానని, అయితే తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వచ్చిందని, తాను అలా చేయడం వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని ఆయన కోరారు.