ఎండలకి పిట్టల్లా రాలుతున్న కోళ్లు..చికెన్ రేట్లకు చుక్కలు

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా మండిపోతున్నాయి. ఎండ వేడిమి తాళలేక జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ ప్రభావం చికెన్ ధరలపై కూడా పడింది. కోళ్ల ఫారాల్లో ఎండ వేడిమి తట్టుకోలేక కోళ్లు చనిపోతుండటం వల్ల మార్కెట్‌లో కేజీ చికెన్ రేట్లకు రెక్కలు వచ్చాయి. వారం ముందు వరకు కేజీ చికెన్ ధర రూ.150 నుంచి 180 మధ్యలో ఉండగా ఈ రెండు రోజుల నుంచి రూ.250కి పెరిగింది. ఇది సామాన్యులపై పెను భారం చూపిస్తోంది. అటు పెరిగిన ధరల వల్ల వినియోగం తగ్గి వ్యాపారం కూడా పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu