చెన్నై.. 20 రోజుల తర్వాత కనిపించిన సూర్యుడు

చాలా రోజుల భారీ వర్షాల అనంతరం చైన్నెలో కొంచెం వర్షం తెరపిచ్చింది. దాదాపు 20 రోజులు తరువాత చెన్నై వాసులు సూర్యుడిని చూస్తున్నఛాయలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ బృందాలు చెన్నైలో సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నారు. అంతేకాదు నీటి మునిగిన ప్రాంతాలకు హెలికాఫ్టర్ల ద్వారా ఆహార పదార్దాలు పంపిణి చేస్తున్నారు. వరదల కారణంగా అనారోగ్యం పాలవకుండా తెలంగాణ ప్రభుత్వం మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసింది.కాగా వర్షాల కారణంగా వారం రోజుల పాటు మూసివేసిన చెన్నై ఎయిర్ పోర్టు ఇప్పుడు పూర్తిస్థాయిలో పనిచేస్తుంది. దేశ, అంతర్జాతీయ సర్వీసులు యథావిధిగా సాగుతున్నాయి

Online Jyotish
Tone Academy
KidsOne Telugu