ఆంధ్ర, తెలంగాణ మధ్య 8 చెక్‌పోస్టులు

 

ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో కొత్తగా ఎనిమిది చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య కొన్ని చెక్ పోస్టులు వున్నాయి. ఇప్పుడు ఏర్పాటు చేయబోయే ఎనిమిది చెక్‌ పోస్టులు అదనం. కొత్తగా ఏర్పాటు చేయబోయే చెక్ పోస్టులు కర్నూలు, సున్నిపెంట, మాచర్ల, దాచెపల్లి, గరికపాడు, తిరువూరు, జీడుగుమిల్లి, కొండపల్లిలో వుంటాయి. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.