రాజధాని నిర్మాణంలో పాలుపంచుకుందాం

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయం నుంచి అన్ని జిల్లాల పాలనా యంత్రాంగాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం ప్రతి ఉద్యోగి నెలలో ఒకరోజు వేతనం విరాళంగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే విరాళాలను ప్రతినెలా ప్రకటిస్తామన్నారు. కనీసం ఒక్క ఇటుకైనా సాయం చేయాలని కోరారు. కొత్త రాజధాని పేరు అమరావతిగా ఖరారు చేసినట్లు తెలిపారు.