వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలపై కేసు
posted on Mar 18, 2025 10:21AM

చైనా కేంద్రంగా పనిచేస్తున్న పలు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నందుకు గాను వైసీపీ అధికార ప్రతినిధి, నటి, యాంకర్ శ్యామలపై హైదరాబాద్ లో కేసు నమోదైంది. శ్యామలతో పాటుగా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న ఆరోపణలపై పలువురు బుల్లి తెర నటులు, యూట్యూబర్లపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. మొత్తం 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కలర్ ప్రిడక్షన్, నంబర్ ప్రిడక్షన్, క్రికెట్.. ఇలా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నారన్న ఫిర్యాదుపై పంజగుట్ట పోలీసులు వైసీపీ అధికార ప్రతినిథి శ్యామల, హర్ష సాయి, విష్ణు ప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, రీతు చౌదరి,టేస్టీ తేజ , అజయ్ కిరణ్ గౌడ్, అజయ్ సన్నీ యాదవ్, సుదీర్ రాజు బయ్యాలపై కేసు నమోదు చేశారు. వీరిపై గేమింగ్ చట్టంలోని సెక్షన్లు, ఐటీ చట్టంలోని సెక్షన్ల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వీరికి త్వరలోనే నోటీసులు జారీ చేసి విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.