వరుడి ఆలస్యం.. వదువుకు నచ్చలేదు.. అందుకే ఇలా చేసింది.. 

అది పచ్చని పందిరి.. ఇంటి నిండా తోరణాలు. పంచభూతాలు, వేదమంత్రాలు  బంధువుల  సమక్షంలో పెళ్లి జరిగింది.. రిసెప్క్షన్ మొదలైయింది. ఆ తర్వాత వధువుకు కోపమొచ్చింది.. పెళ్లి పందిరిలోనే అలా చేసింది.. పెళ్లి కూతురు అలా చేయడంతో ఒక్కసారిగా అక్కడ వచ్చినవారంతా నోటిమీద వేలు వేసుకుని షాక్ తిన్నారు.. ఇంతకీ ఆ పెళ్ళిలో ఏం జరిగింది..? ఎందుకు పెళ్లి కూతురికి కోపం వచ్చిందో తెలుసుకోవాలని ఉందా..? అయితే మరింకెందుకు ఆలస్యం.. తెలుసుకుందాం పదండి.

ప్రతి మనిషి లైఫ్ లో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. మన దేశంలో వివాహాలకు ఒక ప్రత్యేకత , విశిష్టత ఉంది.. మన సంప్రదాయం పై  ప్రపంచమంతా ఒక గౌరవం ఉంది. పెళ్ళిలో సాంప్రదాయిక ఆచారాలకు ఇందులో చాలా గౌరవం ఇస్తారు. పెళ్లి జరిగాక రిసెప్షన్లో నవదంపతులు అందరూ నోరు తీపి చేయడం ఆనవాయితీ.. ఈ సందర్భంగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కు స్వీట్ నోట్లో పెట్టేందుకు ముందుకు వచ్చింది.. ఆ సమయంలో ఓ పెళ్లి కొడుక్కి ఉన్న అనుమానమే లేదా జల్సా సినిమాలో ఇలియానా పదినిమిషాలు లేట్ చేసే అలవాటు ఉన్నటు  నిజంగానే పెళ్లికొడుక్కి కూడా అలాంటి జబ్బు ఏమైనా ఉందొ లేదో తెలియదు గానీ అలా ఆలస్యం చేయడం వదువుకు అసహనం కట్టలు తెంచుకునేలా చేసింది. వధువుకు కోపమొచ్చింది..ఒక్కసారిగా చేతిలో ఉన్న స్వీట్ తీసుకుని పక్కకు విసిరికొట్టింది. ఎవరైనా చూస్తే యమనుకుంటారో అని కూడా ఆలోచించకుండా పెళ్లి పందిరిలోనే అలా చేసింది.. వాళ్ళ పెళ్ళికి వచ్చినవారంతా షాక్ అయ్యారు. 

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలను  చిరస్మరణీయంగా గుర్తుంచుకోవడానికి చూస్తుంటారు. అయితే  ఇలాంటి సంఘటనలపై కొన్నిసార్లు ప్రశంసలు కురుస్తుంటాయి. మరి కొన్నిసార్లు వారు ఎగతాళిగా మారుతాయి. అలాంటి ఒక వీడియో ఇటీవలి రోజుల్లో కనిపించింది. ఇది చూసిన తరువాత, వధువు వివాహం బలవంతంగా జరుగుతోందని మీరు కూడా అనుకోవలసి వస్తుంది. మరి ఆడవాళ్ళకి భూదేవికి ఉన్నంత సహనం ఉంటుందంటారు.. ఆ సహనం నశిస్తే దాని తళుకు రిజల్ట్ ఇలాగే ఉంటుంది అనడానికి ఈ ఫోటోనే సాక్ష్యం..