సుప్రీంకోర్టు నూతన చీఫ్ జస్టిస్‌గా బి.ఆర్. గవాయ్

 

సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టిస్‌గా  బి.ఆర్. గవాయ్ ఎన్నికయ్యారు.  గవాయ్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. మే 14న సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. సీజేఐ పదవి చేపడుతున్న రెండో దళితుడిగా జస్టిస్ గవాయ్. కాగా, మహారాష్ట్రలోని అమరావతికి చెందిన జస్టిస్ గవాయ్‌ 1985లో లాయర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రముఖ న్యాయవాది, మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి రాజా భోన్సాలేతో కలిసి పనిచేశారు. 1987 నుండి 1990 వరకు ముంబై హైకోర్టులో స్వతంత్ర న్యాయవాదిగా పని చేశారు. 1992లో నాగ్‌పూర్‌ బెంచ్‌లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు.

2000లో ప్రభుత్వ న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు. 2003లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్‌ నియమితులయ్యారు. 2005లో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. 2019లో సుప్రీంకోర్టుకు ప్రమోట్ అయ్యారు.  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్‌ గవాయ్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. అత్యున్నత న్యాయస్థానానికి 52వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన  సేవలందించనున్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu