తిరుపతిలో బీజేపీ గెలిస్తేనే ఏడు కొండలు సేఫ్! జగన్ పై సత్యకుమార్ సంచలన కామెంట్లు

జగన్ పాలనలో తిరుమల ఏడు కొండలు కబ్జా అయ్యే అవకాశం ఉందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లోక్ సభకు త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో బీజేపీ గెలిస్తేనే ఏడుకొండలు కబ్జా కాకుండా ఉంటాయన్నారు. తిరుపతి అభివృద్ధిపై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి పెట్టారని సత్యకుమార్ చెప్పారు. తిరుపతి  ఉప ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు బీజేపీ, జనసేనకు మాత్రమే ఉందన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపించి ప్రధాని మోడీకి కానుకగా ఇస్తామన్నారు సత్యకుమార్. 

 

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సత్యకుమార్. ఒక మత వ్యాప్తి కోసం జగన్ పాకులాడుతున్నారని విమర్శించారు. ఏపీలో అభివృద్ధి శూన్యమని, అవినీతికి కొత్తమార్గాలను అన్వేషించడంలో ముఖ్యమంత్రి దిట్ట అన్నారు. జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేతకావడం లేదని విమర్శించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో  వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అనాలోచిత నిర్ణయాలు జగన్‌కే సాధ్యమన్నారు సత్యకుమార్. టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి వైసీపీ నాయకులకు దోచిపెట్టేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇసుకను అధికార పార్టీ నేతలు లూఠీ చేస్తున్నారని విమర్శించారు. జగన్ అవినీతి మొత్తాన్ని త్వరలో బట్ట బయలు చేస్తామన్నారు సత్యకుమార్.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu