తెలంగాణలో బిజెపి, జనసేన పొత్తు ఖరారు
posted on Oct 18, 2023 4:14PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే అంశాలపై ఈ రోజు బిజెపి, జనసేన పార్టీలు చర్చలు జరిపాయి. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో జనసేన కార్యాలయంలో చర్చలు జరిపారు. ఎన్డి ఏలో జనసేన పార్టీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు కల్సి పోటీ చేసి విజయం సాధించడానికి చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. రానున్న ఎపిఎన్నికలలో టిడిపి, జనసేన పార్టీలు పొత్తు ఖరారైంది. అయితే తెలంగాణలో మాత్రం ఎన్ డి ఏలో భాగ స్వామి అయిన జనసేన బిజెపితో పొత్తు పెట్టుకోవాలని చూస్తోంది. తెలంగాణ జనసేన నేతల మనోగతాన్ని పవన్ కళ్యాణ్ కిషన్ రెడ్డికి వివరించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి, బిజెపి అభ్యర్థుల విజయానికి తమ పార్టీ కృషి చేసినట్టు జనసేనాని కిషన్ రెడ్డికి వివరించారు. బి జెపి అగ్ర నాయకుల కోరిక మేరకు హైదరాబాద్ మున్సిల్ కార్పోరేషన్ ఎన్నికల నుంచి జనసేన పార్టీ తప్పుకున్నట్లు పవన్ కళ్యాణ్ ఈ చర్చల్లో కిషన్ రెడ్డికి గుర్తు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 30 స్థానాల నుంచి జనసేన పోటీ చేయాలని యోచిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ బిజెపి అధ్యక్షుడికి వివరించారు. ఒకటి రెండు రోజుల్లో ఇరు పార్టీల అభ్యర్థుల విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ చర్చల్లో బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు.