మూడో రోజుకు బతుకమ్మ సంబురాలు!

తెలంగాణలో బతుకమ్మ సంబురాలు ముచ్చటగా మూడో రోజుకు చేరుకున్నాయి. పూలను పూజించే సంస్కృతి కలిగిన తెలంగాణలో మూడో రోజు బతుకమ్మ సంబరాలను వైభవంగా జరుపుకుంటున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు మొదలవగా రెండో రోజు అటుకుల బతుకమ్మతో మహిళలు ఆడిపాడారు. ఇక ఈరోజు  మూడో రోజు ముద్ద బతుకమ్మను పేరుస్తారు మహిళలు. రెండో రోజున బతుకమ్మను రెండు వరుసలతో పేర్చిన మహిళలు.. మూడో రోజు మూడు వరుసల ఎత్తులో బతుకమ్మను సిద్ధం చేస్తారు. ఆశ్వయుజ శుద్ధ విదియ నాడు ముద్దపప్పు బతకమ్మను శిఖరం ఆకారంలో పేరుస్తారు.