మూడేళ్ళ బాలికపై అత్యాచారం

 

బెంగుళూరులోని ఒక స్కూల్లో చిన్నారిపై అత్యాచారం జరిగిన సంఘటన ఇంకా ప్రజల హృదయాలను కలచివేస్తూనే వుంది. ఇంతలోనే బెంగుళూరులోనే మరో చిన్నారి మీద అత్యాచారం జరిగింది. ఈసారి కూడా స్కూల్లోనే కావడం విషాదం. బెంగుళూరు నగరంలోని జలహళ్ళి ప్రాంతంలో వున్న ఒక స్కూల్లో మూడేళ్ళ వయసున్న చిన్నారి మీద అత్యాచారం జరిగింది. ఈ విషయం ఆ పాప తన తల్లికి చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన మీద పోలీసు కమిషనర్ ప్రాథమిక విచారణ చేపట్టారు.