నారావారిపల్లెలో బాలయ్య సందడి
posted on Jan 13, 2013 4:37PM
తెలుగు హీరో, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణల తన బావ నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లారు. ప్రస్తుతం బాలకృష్ణ తన సంక్రాంతి సంబరాలను వియ్యంకుడు ఇంట్లో జరుపుకుంటున్నారు. శనివారం రాత్రి నారావారిపల్లిలోని బావ చంద్రబాబు ఇంటికి చేరుకున్న బాలయ్య అభిమానులతో కరచాలనం, నమస్కారాలు చేస్తూ సందడిగా కనిపించారు. అభిమానులు, పల్లెప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నారావారిపల్లెలో నారా, నందమూరి కుటుంబసభ్యులు సందడిచేశారు. వీరి రాకతో గ్రామంలో ఒకరోజు ముందుగానే సంక్రాంతి పండుగ వాతావరణం కనిపించింది.
మరోవైపు చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉండటంతో ఆయన ఖమ్మం జిల్లాలోనే సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. సెయింట్ జోసెఫ్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు పాఠశాల ఆవరణలో భోగిమంటలు, ముగ్గుల పోటీలు, పతంగుల ప్రదర్శన, గంగిరెద్దుల ఆటలు లాంటివి ఏర్పాటుచేసి సంక్రాంతి సందడి సృష్టించారు.