ఆసుపత్రిలో ఒక బ్లాక్ కు తారకరత్న పేరు.. బాలకృష్ణ నిర్ణయం

నందమూరి బాలకృష్ణ  తారకరత్న  పేరు మీద గుండె జబ్బులున్న  పేదలకి ఉచితంగా చేసేందుకు  నిర్ణయం తీసుకున్నారు

తన ఇంట్లో వచ్చిన కష్టం ఎవరికి రాకూడదు అన్న ఉద్దేశంతో హిందూపురంలో తాను ను నిర్మించిన హాస్పటల్ లో హెచ్ బ్లాక్ కి తారకరత్న   పేరు పెట్టారు. అలాగే పేదలకు వైద్యం కోసం కోటీ 30 లక్షల రూపాయల విలువ చేసే సర్జికల్ పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు.

ఈ ఆసుపత్రిలో  చిన్నపిల్లలకి ఉచిత భోజనంతో పాటు కావాల్సిన మందులు కూడా మూడు నెలల పాటు ఉచితంగా ఇవ్వనున్నారు.