బిఆర్ ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు
posted on Mar 18, 2025 4:06PM
ఎల్బీనగర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదైంది. సుధీర్ రెడ్డి నియోజకవర్గంలోని మన్సూరాబాద్ డివిజన్ లో సోమవారం పలు అభివృద్దికార్యక్రమాలకు శంకు స్థాపన చేశారు. అవే పనులకు బిజెపి కార్పోరేటర్ కొప్పుల నరసింహారెడ్డి శంకు స్థాపన చేయడంతో ప్రోటోకాల్ రగడ మొదలైంది. బిఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే శంకు స్థాపన చేశాక మీరెలా చేస్తారని కార్యకర్తలు కార్పోరేటర్ను నిలదీశారు. అదే డివిజన్ లో మరో చోట శంకు స్థాపన చేయడానికి కొప్పుల నర్సింహారెడ్డి వెళ్లారు. బిఆర్ ఎస్ నేత జక్కిడి రఘువీర్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఆందోళనకు దిగారు. బిఆర్ ఎస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు అబ్దుల్లామెట్ స్టేషన్ కు తరలించారు. ఘర్షణలో గాయాలకు గురైన వారిని పరామర్శించడానికి అబ్దుల్లామెట్ పిఎస్ కు వచ్చిన సుధీర్ రెడ్డికి కాంగ్రెస్ నేత మధు యాష్కితో వాగ్వివాదం జరిగింది. హస్తినాపూరం కాంగ్రెస్ కార్పోరేటర్ బానోతు సుజాత నాయక్ తో మధుయాష్కికి మధ్య హానిమూన్ నడుస్తుందని వ్యాఖ్యలు చేసినట్టు సుధీర్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై సుజాత నాయక్ ఎల్బీనగర్ పిఎస్ లో ఫిర్యాదు మేరకు సుధీర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేసారు.