అధికారంలోకి వస్తే రోమియోల చేతులు నరికేస్తా

 

బీజేపీ, దాని అనుబంధ పార్టీ నేతల మాటలతో దేశ ప్రజలకు పిచ్చెత్తిపోతోంది. ఓ పక్క త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేవ్ రోజుకో వింత కామెంట్‌ చేస్తుంటే, దేశం నలుమూలల నుంచీ బీజేపీ నేతల రకరకాల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆఖరికి మోదీగానే దిగివచ్చి కాస్తా ఆచితూచి మాట్లాడమంటూ తన పార్టీ క్యాడర్‌ను హెచ్చరించాల్సిన అవసరం వచ్చింది. పరిస్థితులు ఇలా ఉంటే ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాధ్‌ మంత్రివర్గంలోని మంత్రి ఓం ప్రకాష్ రాజ్బర్ కుమారుడు, సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ నేత అరవింద్ రాజ్బర్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము కనుక అధికారంలోకి వస్తే... ఆడవారిని తాకడానికి ప్రయత్నించే ఆకతాయిల చేతుల నరికిపారేస్తామని హెచ్చరించారు. ఈ మాటలకు బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu