ఓటు వేయ‌డానికి ఎన్నారైల రాక! టీడీపీ గెలుపు కోసం ఎన్నారైల‌ ప్రచారం

ఎన్నిక‌ల పండగలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రవాస భారతీయులు ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా కేరళ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ నుంచి విదేశాలకు వెళ్లినవారిలో.. వేల మంది స్వదేశీ బాట పట్టారు. ఇందుకోసం ప్రత్యేక విమానాలను ఆశ్రయిస్తున్నారు. గత రెండు రోజుల్లోనే దాదాపు 25 వేలకు పైగా ఎన్నారైలు వచ్చినట్లు అంచనా. పోలింగ్‌ తేదీ నాటికి ఈ సంఖ్య భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. అమెరికా, కెన‌డా, లండ‌న్‌తో పాటు  గల్ఫ్‌ దేశాల నుంచి పోలింగ్‌లో పాల్గొన‌డానికి త‌ర‌లి వ‌స్తున్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా పోలింగ్‌లో భాగస్వామ్యం చేసేందుకు రాజకీయ పార్టీలు విదేశాల్లోనూ ప్రచారం చేశాయి. స్వదేశానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశాయి.

విదేశాల నుండి ఎన్ ఆర్ ఐ లు రావడం తో ఢిల్లీ -  విజయవాడ విమానం రద్దీ నెలకొంది.  ఓటు  హక్కు వినియోగించుకోవడానికి  మునుపెన్నడూ లేని విధంగా సుదూర ప్రాంతాల నుండి వస్తున్నారు. ఇదే ఒరవడి మరో మూడు రోజు లు కొనసాగుతుంది అని విమానాశ్రయాధికారులు చెబుతున్నారు.  విదేశాలనుండి వచ్చే వారంతా చంద్ర‌బాబుకు సంఘీభావంగానే వస్తున్నారు. టీడీపీ కూట‌మి గెలుపు కోసం ఎన్నారైలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.

విదేశాలలోని టీడీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో  ఉద్యోగాలకు సెలువు పెట్టి, త‌మ వ్యాపారాలకు తాత్కలిక విరామం ఇచ్చి ఓటు వేయ‌డానికే విమానం ఎక్కేశారు.  ఈ రకమైన అంకితభావం కేర‌ళ‌లో క‌నిపిస్తోంది. ఇప్పుడు ఏపీకి చెందిన వారు ఓటు వేయ‌డానికి భారీ సంఖ్య‌లో విదేశాల నుంచి వ‌స్తున్నారు.
ఒక ప్రణాళికాబద్ధంగా ఏపీలోని అన్ని నియోజకవర్గాలలోనూ అమెరికా నుండి వచ్చి ప్ర‌చారంలోనూ పాల్గొన‌డం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. రాష్ట్రాన్ని రక్షించేందుకు తాము ప్రత్యక్షంగా రంగంలో దిగిన‌ట్లు వారు చెబుతున్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి పోటి చేస్తున్న అన్ని నియోజకవర్గాలలో ఎన్నారై తెలుగుదేశం బృందాలు సీరియ‌స్‌గా ప‌నిచేస్తున్నారు. మంగళగిరిలో పార్టీ ఏర్పాటు చేసిన వార్ రూంలో ఎన్నారై టీడీపీ అధ్యక్షుడు వేమూరి రవి కీలకపాత్ర వహిస్తున్నారు.

- ఎం.కె.ఫ‌జ‌ల్‌