రాజీనామాలు చేసి జనంలోకి రండి
posted on Aug 30, 2013 8:04AM
విభజన ప్రకటనతో సీమాంద్రలో భారీ ఎత్తున నిరసనలు వెళ్లువెత్తుతున్న నేపధ్యంలో కేంద్రమంత్రులు, ఎంపీలతో ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశం అయ్యారు. వాడివేడిగా జరిగిన చర్యల్లో నేతలను ఇంకా ఎందుకు రాజీనామ చేయలేదని జేఎసి నాయకులు నిలదీశారు. విభజన ప్రకటన వెనక్కి తీసుకునేలా రాజకీయా నాయకులు కూడా కార్యచరణ చేపట్టాలని నాయకులు పై ఒత్తిడి తెచ్చారు.
ఇంకా ఏం సాదించటానికి మీరు పదవులలో కొనసాగుతున్నారు. సీమాంద్రలో జరుగుతున్న ఉద్యమ తీవ్రతను కేంద్రానికి తెలియజేయటంలో మీరు పూర్తిగా విఫలమయ్యారంటూ నాయకుల పై మండిపడ్డారు. రాజీనామాలు చేయకుండా జనంలో ఎలా తిరగాలనుకుంటున్నారు, మీరు రాజీనామ చేస్తే తిరిగి మిమ్మలన్ని గెలిపించుకునే పూచీ మాది అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఈ సమావేశంలో ఎంపీలు కేవీపీ రామచంద్రారావు, లగడపాటి రాజగోపాల్, అనంత వెంకటరామిరెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్, హర్షకుమార్ మంత్రులు చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, పనబాక లక్ష్మి, కావూరు సాంబశివరావు, పళ్లంరాజు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, జెడీ శీలం, కిల్లి కృపారాణి ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబుతో పాటు 30 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.