ఏపీకి 4 రాజధానులు... ఎంపీ సంచలన వ్యాఖ్యలు

 

నవ్యాంధ్ర రాజధానిపై వివాదం కొనసాగుతూనే ఉంది. మంత్రి బొత్స వ్యాఖ్యలతో మొదలైన రగడ కంటిన్యూ అవుతోంది. బొత్స యాధృశ్చికంగా ఉన్నారో ...లేక కావాలనే అన్నారో తెలియదు కానీ, రాజధానిగా అమరావతి అనుకూలం కాదన్న కామెంట్స్ పై అధికార, ప్రతిపక్షాల్లో ఒక్కొక్కరు ఒక్కోవిధంగా స్పందిస్తున్నారు. తాజా బీజేపీ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్.. బొత్సను మించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి కొనసాగకపోవచ్చన్న టీజీ వెంకటేష్... ఏపీకి నాలుగు రాజధానులు ఉండబోతున్నాయంటూ చెప్పుకొచ్చారు. రాజధాని అంశంపై ఇప్పటికే సీఎం జగన్ బీజేపీ అధిష్టానంతో చర్చించారని, అందులో భాగంగానే నాలుగు రాజధానుల ప్రతిపాదన వచ్చిందని అన్నారు. ఈ విషయం తనకు బీజేపీ అధిష్టానమే చెప్పిందన్నారు. 

ఏపీకి ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా నాలుగు రాజధానులు ఉంటాయని చెప్పుకొచ్చిన టీజీ... ఉత్తరాంధ్రలో విజయనగరం... గోదావరి జిల్లాల్లో కాకినాడ.... రాయలసీమలో కడప.... అలాగే గుంటూరు జిల్లాలు ఏపీకి రాజధానులు కాబోతున్నాయని అన్నారు. ఇది నూటికి నూరుశాతం నిజమంటూ టీజీ సరికొత్త బాంబు పేల్చారు.