ఆంధ్రా మరో కేరళ అవుతుందా? జగన్ సర్కార్ లక్ష్యమేంటీ?

ఆంధ్రాలో జరుగుతున్న పరిణామాలపై సర్వత్రా ఆందోళన నెలకొంటోంది. జగన్ సర్కారు మూర్ఖపు వైఖరిని ప్రజలంతా నిశితంగా గమనిస్తున్నారు. పండుగలు కూడా జరుపుకునే స్వేచ్ఛ లేదా అంటూ సామాన్యుడి నుంచి ధనవంతుడి వరకు హిందూ భక్తులంతా జగన్ ప్రభుత్వ  వైఖరిని నిలదీస్తున్నారు. జగన్ లో ఇంత కరుడుగట్టిన హిందూ వ్యతిరేకి ఉంటాడని తాము అనుకోలేదని, వ్యక్తిగతంగా ఏ ధర్మాన్ని అవలంబించినా పాలకుడిగా అందరిసెంటిమెంట్లను ఆదరించే, గౌరవించే ఔన్నత్యం ఉంటుందనే తాము భావించామని, అందుకే ఎవరేమనుకున్నా జగన్ కు ఉన్నతమైన ముఖ్యమంత్రి స్థానం కట్టబెట్టి తమ పాలకుడిగా నెత్తిన పెట్టుకున్నామని, అయితే పాలకుడైన తరువాత మాత్రం జగన్ పూర్తి ఒంటెద్దు పోకడలు పోతున్నారని ప్రజలంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. జగన్ వైఖరి విద్యావంతులకు, మేధావులకు, సెక్యులరిస్టులకు, యాక్టివిస్టులకు సైతం జీర్ణం కాకపోవడం విశేషం. 

వినాయక చవితిని కేవలం ఇళ్లలోనే జరుపుకోవాలని జగన్ సర్కారు ఎందుకు ఆదేశించిందో ఎవరికీ అంతు పట్టడం లేదు. వినాయక చవితి అనగానే పిల్లలు, యూత్, వృద్ధులు సైతం ఆ తొమ్మిది రోజులు ఎంతో ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకుంటారు. ఊరూరా అనేక వీధుల్లో వినాయక మండపాలు వేసి శక్తికొద్దీ గణేశ్ విగ్రహాలు తీసుకొచ్చి అలంకరించి ముచ్చటగా వేడుకలు జరుపుకుంటారు. అయితే వినాయక మండపాలు పెట్టుకునేవారు ముందుగా తమకు తెలియజేయాలని పోలీసులు నిబంధనలు విధించడం సాధారణం. ఎందుకంటే ఇలా వినాయకుల విగ్రహాల లెక్కలు సేకరించినప్పుడే నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడానికి అవకాశం ఉంటుంది. అపశ్రుతులు నివారించే ఆస్కారం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తోంది. కానీ జగన్ ఏనాడూ లేంది ఈసారి వింత పోకడలు, చెత్త పోకడలు పోతూ హిందూ సెంటిమెంట్లు గాయపరచడమే పనిగా పెట్టుకున్నాడని జనమంతా గగ్గోలు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రజలంతా గుమిగూడి జరుపుకునే బక్రీద్ ప్రార్థనలు, మొహర్రం వేడుకలు, క్రిస్మస్ వేడుకలకు లేని ఆంక్షలు అక్కడక్కడా వీధుల్లోని మండపాల్లో జరుపుకునే వినాయక చవితికే ఎందుకొచ్చాయని జగన్ ను నిలదీస్తున్నారు. 

జగన్ వైఖరి కారణంగా ప్రజల సెంటిమెంట్లు గాయపడటమే కాకుండా.. అసలు వినాయక విగ్రహాల తయారీ మీదనే జీవించే ఎందరో పేద కార్మికుల పొట్ట కొట్టినట్టవుతోందన్న నిరసనలు ఊపందుకుంటున్నాయి. ఒకవేళ ఇలాంటి నిర్ణయం 3 నెలల ముందే తీసుకుంటే అప్పుడు ప్రజలు మరోలా రిసీవ్ చేసుకునేవారని, తీరా పండుగ ముందు ఇలా ఆంక్షలు పెట్టి కేవలం ఇళ్లలోనే జరుపుకోవాలని షరతులు విధించడమేంటని ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే కరోనా కారణంగా గతేడాది కూడా వినాయక వేడుకలు పరిమిత స్థాయిలోనే జరిగాయి. విగ్రహాల తయారీ గానీ, కొనుగోళ్లు గానీ పెద్దగా జరగలేదు. దీంతో విగ్రహాలు తయారుచేసే శ్రామికులకు కడుపునిండా సరైన భోజనం కూడా దొరకలేదు. అలాంటిది ఇప్పుడు కూడా వారు తయారు చేసిన విగ్రహాలను తీరా అమ్ముకునే సమయంలో జగన్ పిడుగులాంటి నిర్ణయం తీసుకున్నాడని, తమకు వచ్చే అరాకొరా పైసలు కూడా రాకుండా పోతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పండుగను కేవలం ఇళ్లకే పరిమితం చేస్తే దాని మీదే ఆధారపడ్డ వ్యాపారాలు కూడా పడకేస్తాయంటున్నారు. ఏ ముందుచూపు లేకుండా జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే జగన్ పిచ్చి పీక్స్ కు వెళ్లిందన్న ఆగ్రహం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. 

మరోవైపు ప్రభుత్వం ఆదేశాలందుకున్న పోలీసులు విగ్రహాల తరలింపు కోసం మున్సిపాలిటీ చెత్త వాహనాలు వాడటం, వాటిలోనే అందమైన వినాయక ప్రతిమలను బలవంతంగా తరలించడాన్ని ప్రజలు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. విగ్రహాల తరలింపుకు అడ్డుపడుతున్న స్థానిక హిందూ సంస్థల కార్యకర్తలు, కొనుగోలుదారులతో పోలీసులు చాలా దురుసుగా వ్యవహరిస్తున్నారు. ఎవరొస్తారో రానీయండి.. మేమూ చూస్తాం అంటూ హిందువుల సెంటిమెంట్లను తీవ్రంగా గాయపరుస్తున్నారు. తమకు పండుగ చేసుకునే హక్కు లేదా, స్వేచ్ఛ లేదా అంటూ పోలీసుల్ని నిలదీస్తుంటే... గొంతు లేవకూడదని, చెప్పింది చేయాలని వినాయక చవితి వేడుకతో, హిందువుల సెంటిమెంట్లతో చెలగాటమాడుతున్నారు. పోలీసుల వైఖరితో గుంటూరు జిల్లాలో పరిస్థితులు పలుచోట్ల ఉద్రిక్తంగా మారాయి. 

వినాయక చవితిని టార్గెట్ చేసిన జగన్ అసలు ఆంధ్రాను ఏం చేయాలనుకుంటున్నాడు అన్న ప్రశ్నలు క్రమంగా బలపడుతున్నాయి. జగన్ వైఖరి ఇలాగే కొనసాగితే త్వరలోనే ఆంధ్రా మరో కేరళగా మారడం ఖాయమని, ఆ తరువాత హిందువులు, ఇతర వర్గాల మధ్య వైరం పెరిగి ఆశాంతికి దారితీస్తుందని అలాంటి పరిస్థితులు ఏర్పడకముందే విపక్షాలు కూడా వినాయక చవితి విషయంలో జగన్ ను నిలదీయాలన్న డిమాండ్లు బలపడుతున్నాయి. జగన్ ను ఇలాగే ఉపేక్షిస్తే హిందువులను దారుణంగా అణచివేసి మరో కేరళగా మార్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న ఆందోళన క్రమంగా ఊపందుకుంటోంది. 

కేరళ చరిత్రను గమనిస్తే 1920ల్లోనే అక్కడ హిందువుల ఊచకోతలు జరిగాయి. ఎక్కడో టర్కీలో తలెత్తిన ఖిలాఫత్ ఉద్యమానికి ఇక్కడి ముస్లింలు మద్దతివ్వడం, హిందువులను ఊచకోత కోయడం జరిగాయి. ఆనాటి సామూహిక మారణకాండను నిరసిస్తూ హిందూ సంస్థలు ప్రదర్శనలు చేస్తే... ఆ ఊచకోతను స్ఫూర్తిగా తీసుకొని ముస్లిం సంస్థలు గతేడాది పోటాపోటీ ర్యాలీలు తీశాయి. రెండు వర్గాల మధ్య స్నేహ వాతావరణం చెడిపోయి పలుచోట్లు ఉద్రిక్తతలకు దారితీసింది. మరోవైపు హిందూ అమ్మాయిలే టార్గెట్ గా లవ్ జిహాద్ పేరుతో చాపకింద నీరులా మతమార్పిడి కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. అలాంటి పరిస్థితులే ఇప్పుడు ఆంధ్రాలో కూడా తలెత్తే ప్రమాదం లేకపోలేదన్న ఆందోళనలు ఇప్పుడు బలపడుతున్నాయి. 

హిందూ సెంటిమెంట్లు గాయపరిస్తే దాని అవమానం మరో రూపంలో వెల్లువెత్తే ప్రమాదాన్ని కొట్టిపారేయలేమన్న హితోక్తులను మేధావులు సైతం వ్యక్తం చేస్తున్నారు. ముస్లింలకు, క్రిస్టియన్లు పూర్తి స్వేచ్ఛనిచ్చిన జగన్ సర్కారు... అసలు హిందువులనే ఎందుకు అణగదొక్కుతున్నాడన్న ఆలోచన అందరిలోనూ రగులుకుంటోంది. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ ఆలయాలే టార్గెట్ గా అనేకమైన దాడులు జరిగాయి. 100 కు పైగా ఆలయాలు, దేవతా విగ్రహాలపై దాడులు జరిగాయి. చాలా విగ్రహాలు ధ్వంసమయ్యాయి. ఇక తాజాగా వినాయక చవితి ఆంక్షలు విధిస్తే ఇతర వర్గాలవారు హిందూ సెంటిమెంట్లను మరింత చులకన చేసి మాట్లాడతారని, అదే తరహాలో వ్యవహరిస్తారన్న అనుమానాలు ముసురుకుంటున్నాయి. అలాంటివి జరగకుండా ఉండాలంటే తక్షణమే జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలన్న హితోక్తులు వినిపిస్తున్నాయి. మరి జగన్ వింటాడా... చూడాలి.