గుజరాత్ లో మంత్రి నారాయణ బృందం రెండు రోజుల పర్యటన.. ఎలా సాగుతోందంటే?

ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ రెండు రోజుల గుజరాత్ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా ఇతర రాష్ట్రాలలో  దేశంలోని ఇత‌ర రాష్ట్రాల్లో అధ్య‌యనం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే నారాయణ బృందం గుజరాత్ వెళ్లింది.  ఆదివారం (ఏప్రిల్ 20)) అహ్మదాబాద్ చేరుకున్న నారాయణ బృందం అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఏక్తానాగర్ చేరుకుంది.  అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహ నిర్మాణానికి ఉపయోగంచిన సాంకేతికత, పరికరాలు తదితర అంశాలను పరిశీలించింది.

 ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించ తలపెట్టిన భారీ విగ్రహాల కోసం మంత్రి నారాయణ బృందం పటేల్ విగ్రహాన్ని పరిశీలించింది. ఈ బృందంలో ఏడీసీ చైర్ పర్సన్ లక్ష్మీపార్థసారథి, గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు,  సీఆర్డీఏ క‌మిష‌న‌ర్ క‌న్న‌బాబు తదితరులు ఉన్నారు. ఈ బృందం ఇప్పటికే  ముంబ‌యి, ఢిల్లీలో ప‌ర్య‌టించిన సంగతి విదితమే. ఇప్పుడు గుజరాత్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ బృందం .ఏక్తాన‌గ‌ర్ లో ప్ర‌పంచంలోనే అతిపెద్ద‌దైన స‌ర్ధార్ వ‌ల్ల‌భాయి ప‌టేల్ విగ్ర‌హాన్ని ప‌రిశీలించారు.అనంతరం  స్థానిక అధికారుల‌తో పాటు ప‌టేల్ విగ్ర‌హ నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీ ప్ర‌తినిధులు మంత్రి నారాయణ బృందానికి పవ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా విగ్రహ నిర్మాణం చేసిన విధానం. అందుకోసం ఉపయోగించిన సాంకేతికత, సామగ్రి తదితర అంశాలను వివరించారు. 

అమ‌రావ‌తిలో ఎన్టీఆర్ విగ్ర‌హం తో పాటు మ‌రికొంత‌మంది ప్ర‌ముఖుల భారీ విగ్ర‌హాలు ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఆ విగ్రహాల నిర్మాణం కోసమే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహన్ని పరిశీలించిన నారా యణ బృందం   దానికి అనుగుణంగా నిర్మించిన కట్టడాలనూ పరిశీలించింది. అనంతరం    అహ్మ‌దాబాద్ గాంధీన‌గ‌ర్ జిల్లాలో ఉన్న గిఫ్ట్( గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ (గిఫ్ట్), సెంటర్ ఫర్ ఎన్విరాన్ మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ (సెప్ట్ ) యూనివర్శిటీనీ సందర్శించింది.  అలాగే స‌బ‌ర్మ‌తి రివ‌ర్ ఫ్రంట్ ను కూడా మంత్రి నారాయణ బృందం సంద‌ర్శించింది.   స‌బ‌ర్మ‌తి న‌దీ తీర ప్రాంతం అభివృద్ది కోసం గుజ‌రాత్ ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా స‌బ‌ర్మ‌తి రివ‌ర్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ ను కూడా ఏర్పాటుచేసింది.  .

అమ‌రావ‌తి కూడా కృష్ణా నది ఒడ్డున నిర్మిస్తుండ‌టంతో, స‌బ‌ర్మ‌తి రివ‌ర్ ఫ్రంట్ ను ఏవిధంగా అభివృద్ది చేసార‌నే దానిపై అధ్య‌య‌నం చేసింది మంత్రి నారాయణ బృందం. ఇక రెండో రోజు పర్యటనలో భాగంగా సోమ‌వారం(ఏప్రిల్ 21)న మంత్రి నారాయణ బృందం  స్పోర్ట్స్ సిటీని సందర్శనలో భాగంగా  న‌రేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంను మంత్రి బృందం సంద‌ర్శించ‌నుంది. అమరావతిలో కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్ సిటీని నిర్మించనున్న సంగతి తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu