విజయసాయికి షాక్ ఇచ్చిన జగన్...ఆ పదవి నుండి తప్పించారు !
posted on Jul 5, 2019 9:19AM

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. దానికి కారణం, కొద్దిరోజుల క్రితం తనకి అత్యంత సన్నిహితుడు అయిన ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ, జగన్ పార్టీ నేతలు అందరూ నెంబర్ 2గా భావిస్తున్న విజయసాయి రెడ్డికి అప్పచెప్పిన క్యాబినెట్ హోదా కలిగిన ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి నుండి ఊడబీకడమే. కొద్దిరోజుల క్రితమే ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన వైసిపి ఎంపి విజయసాయి రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం తొలిగించింది.
ఈ మేరకు నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం గత నెల 22న జారీ చేసిన జీవో 68ని ఉపసంహరించుకుంది. విజయసాయి రెడ్డి ఎంపీ హోదాలో ఉన్నందున నియామకాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకున్నట్లు చెబుతున్నారు. గతంలో టీడీపీ హయాంలో కంభంపాటి రామ్మోహన్ రావు ఈ బాద్యతలు చేపట్టేవారు, నిజానికి ఇది రాజ్యంగ పదవి కావడంతో ఈ నియామకం చెల్లదని సమాచారం.
ఎవరైనా కోర్టులో కేసు వేసి ఉంటే కోర్టు ప్రభుత్వం మీద మొట్టికాయలు వేసి మరీ పదవి నుండి తప్పించేది. విషయం గ్రహించిన ప్రభుత్వ అధికారులు జగన్ తో మాట్లాడి సాయి రెడ్డిని తప్పించారని చెబుతున్నారు. ఇక ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని ఎపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన నేతలను ఢిల్లీలోని ఏపి ప్రభుత్వం ప్రతినిధిగా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోంది.విజయసాయికి షాక్