వేళ్ళ మీద ఇంకు గుర్తు వేస్తే చర్యలు

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా ఈ విషయంలో ఎలర్ట్ చేశారు. ఓటర్ల ఇళ్ళకు వెళ్ళి, వాళ్ళకి డబ్బు ఇచ్చి, వారి వేళ్ళ మీద ఇంకు గుర్తు వేసి, వాళ్ళు ఓటింగ్‌కి వెళ్ళకుండా చేసే ప్రయత్నం జరుగుతోందని హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలతోపాటు ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఈ తరహా కుట్ర జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ ఇష్యూ మీద రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముకేష్ కుమార్ మీనా స్పందించారు. ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళ మీద గుర్తు  వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేళ్ళ మీద వేసే సిరా ప్రభుత్వమే తయారు చేస్తుందని, ఆ ఇంక్ కేంద్ర ఎన్నికల సంఘం వద్దనే అందుబాటులో వుంటుందని ఆయన తెలిపారు. ఇతరుల దగ్గర చెరగని సిరా వుండదని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ, ఎవరైనా ఓటర్ల వేళ్ళ మీద ఇతర సిరాలతో గుర్తు వేస్తే, దానిని చట్టవ్యతిరేక చర్యగా భావించి కఠన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu