అనుష్క లుక్ పై సమంత ట్వీట్

 

అందాల నటి అనుష్క, ఆర్య జంటగా కలిసి సైజ్ జీరో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో సైజ్ జీరో అంటే అనుష్క కూడా అదే సైజులో ఉంటుందని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో అనుష్క భారీకాయం లుక్‌తో ఫోటో చూసి ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజంగానే అనుష్క లుక్ డిఫరెంటుగా... సైజ్ జీరోకు వ్యతిరేకంగా చాలా బొద్దుగా ఉంది. దీనిలో భాగంగాన్ ఆర్యతో కలిసి ఇచ్చిన ఫోటో ఫోజుతో ఇప్పుడు సినిమాపై ఆసక్తి నెలకొంది. వెయిట్ లాస్ కాన్సెప్ట్ తో తీస్తున్న ఈసినిమాలో ఈపాత్ర కోసం అనుష్క 20 కేజీల బరువు పెరిగిందట. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న వరల్డ్ వైడ్‌గా 1500 థియేటర్స్‌లో ‘సైజ్ జీరో’ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

 

ఇదిలా ఉండగా ఈ సైజ్ జీరోలో అనుష్క లుక్ పై మరో అందాల చిన్నది సమంత అనుష్క అక్కా... సైజ్ జీరో లుక్ అదిరిపోయిందక్కా అంటూ ట్వీట్ చేసింది.