సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు ముందస్తు బెయిల్
posted on Jan 30, 2025 5:19PM
.webp)
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యాంటిసిపేటరీ బెయిలు మంజూరు చేసింది. జగన్ హయాంలో ఆయన పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని తన ఖాతాలో వేసుకున్నాన్న అభియోగాలపై కూటమి ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఆయన అరెస్టు భయంతో ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆయన యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను విచారించిన హైకోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది.
మార్గదర్శి, చంద్రబాబుపై కేసుల్లో ఆయన చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. సర్వీస్ రూల్స్ కు వ్యతిరేకంగా ఢిల్లీ సహా పలు చోట్ల మీడియా సమావేశాలలో మాట్లాడారు. అయితే వాటిపై కాకుండా ఆయన అధికారంలో ఉండగా అవినీతికి పాల్పడి పెద్ద ఎత్తున సొమ్ము దండుకున్నారన్న అభియోగాలపై కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసుల్లోనే సంజయ్ కు ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిలు లభించింది.