అంత్రాక్స్ మళ్లీ బయటకొచ్చింది..అది కూడా ఏపీలో..!
posted on Apr 27, 2016 11:56AM
2001లో ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన అంత్రాక్స్ మహమ్మారి మళ్లీ పడగవిప్పుతోంది. విశాఖ ఏజెన్సీలో అంత్రాక్స్ ప్రబలి గతంలో చాలా మంది మృత్యువాత పడ్డారు. తాజాగా హుకుంపేట మండలం పనసకుట్టులో 16 మందికి అంత్రాక్స్ లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మండలంలోని తాడిపుట్టు, ఉర్రాడ, నిమ్మపాడు, బొడ్డాపుట్టు గ్రామాల్లోని కొందరు గత వారం రోజులుగా కాళ్లు, చేతులపై మచ్చలుతో బాధపడుతున్నారు. ఇవి అంత్రాక్స్ లక్షణాలను పోలి ఉండటంతో వైద్యులు వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. దీంతో ఆయా గ్రామల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ వ్యాధికి సోకిన వారికి తీవ్ర జ్వరం, వాంతులు, పొత్తి కడుపులో నొప్పి, శరీరంపై ఎర్రని మచ్చలు, దగ్గు, తలనొప్పి, గొంతునొప్పి వస్తాయి.