మరో మెడికో ఆత్మహత్య
posted on Feb 25, 2023 1:10PM
వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్మయత్నం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమె ఆస్పత్రిలో ఇంకా ప్రాణాలతో పోరాడుతూనే ఉంది. అంతలోనే మరో మెడికో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళా. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న దాసరి హర్ష (22) తన హాస్టల్ గదిలో శుక్రవారం ( ఫిబ్రవరి 24) రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
దాసరి హర్ష ఆత్మహత్యకు కారణాలేమిటన్నది తెలియాల్సి ఉంది. శుక్రవారం డిన్నర్ చేసేంత వరకూ తోటి విద్యార్థులతో కలివిడిగా తిరిగిన హర్ష ఆ తరువాత తన గదిలోకి వెళ్లిపోయాడనీ, ఉదయం చూసే సరికి ఉరి వేసుకుని మరణించాడని సహ విద్యార్థులు చెబుతున్నారు. దాసరి హర్ష స్వస్థలం మంచిర్యాల జిల్లా చింతగూడ.