ఏపీకి మరో వాయు‘గండం’

ఏపీని వర్షాలు వరదలు వదిలిపెట్టేలా లేవు. భారీ వర్షాలు వరదల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఆంధ్రప్రదేశ్ కు మరో వాయుగండం పొంచి ఉందన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం అప్రమత్తమైంది. వ బంగాళాఖాతంలో సెప్టెంబరు మూడోవారంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది వాయుగుండంగా బలపడి రాష్ట్రంవైపు కదిలే అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొంది. దీంతో ఈ నెల చివరి వారంలో ఆంధ్రప్రదేశ్ లో మరో మారీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 

 కేదార్ నాథ్ లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు

ఇక పోతే భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్లోని కేదార్ నాథ్ లో దాదాపు 20 మంది యాత్రికులు చిక్కుకున్నారు. చలి తీవ్రత అధికంగా ఉండటం, భోజనం కూడా లేకపోవడంతో గత రెండు రోజులుగా వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో తిరిగి వచ్చేందుకు ఎటువంటి రవాణా సదుపాయం లేకుండా పోయిందని చెబుతున్నారు. దీంతో వారిని క్షేమంగా రాష్ట్రాలనికి తీసుకువచ్చేందుకు తెలుగుదేశం ప్రయత్నాలు ప్రారంభించింది. హెలికాప్టర్ ను పంపేందుకు కూడా వాతావరణం అనుకూలించకపోవడంతో వారిని స్వరాష్ట్రానికి తీసుకువచ్చేందుకు మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుున్నారు. ఇలా ఉండగా తెలుగుదేశం ఎంపీ అప్పలనాయుడు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు. వారిని క్షేమంగా స్వరాష్ట్రానికి తీసుకువచ్చే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుందని ఆయన అన్నారు.