ఆర్జీవీపై రాజమహేంద్రవరంలో మరో ఫిర్యాదు

వివాదాస్పద దర్శకుడు రామగోపాల వర్మపై రాజమహేంద్రవరంలో ఒక ఫిర్యాదు నమోదైంది. ఆయన హిందువుల మనోభావాలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది మేడా శ్రీనివాస్ రాజమహేంద్రవరం మూడో టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రామ్ గోపాల్ వర్మతో పాటు యాంకర్ స్వప్నపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు.

వీరిరువూ సామాజిక మాధ్యమంలో హిందువులను కించపరిచేలా పోస్టులు పెట్టారని పేర్కొంటూ అందుకు సంబంధించిన ఆధారాలను కూడా జతపరిచారు.  వీరిరువురూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు    సామాజిక భద్రతకు, జాతీయ సమగ్రతకు ముప్పు వాటిల్లేలా ఉన్నాయని మెడీ శ్రీనివాస్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ  వ్యాఖ్యలలో హిందూ దేవుళ్ల పట్ల అమర్యాద కరంగా ఉన్నాయనీ, పవిత్ర గ్రంథాలైన మహాభారతం, రామాయణాలను అపహాస్యం చేసేవిగా ఉన్నాయనీ మేడీ శ్రీనివాస్ పేర్కొన్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu