17 నుంచి చంద్రబాబు విదేశీ పర్యటన

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సకుటుంబ సమేతంగా ఈ నెల 16న ఢిల్లీకి వెడుతున్న చంద్రబాబు  అక్కడ నుంచి విదేశీ పర్యటనకు వెడతారు. ఈ నెల 20న  ద్రబాబు 75వ జన్మదినం. తన వజ్రోత్సవ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలలో జరుపుకుంటారు.  

మోదీ అమరావతి పర్యటన మే 2న ఖరారైన సంగతి విదితమే. మోడీ ఏపీ పర్యటనకు ముందే చంద్రబాబు విదేశాల నుంచి తిరిగి వచ్చేస్తారు. కాగా చంద్రబాబు విదేశీ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమైనది కావడంతో వివరాలను వెల్లడించకుండా గోప్యంగా ఉంచారు.