ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

 

నెల్లూరు జిల్లాలోని బాలాయపల్లెలో ఘోరం జరిగింది. ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా బావిలోకి దూకి ఆత్యహత్యకు పాల్పడింది. బావికి సమీపంలోని ఒక గోడ మీద తమ చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోట్ అతికించి మరీ ఆ మహిళ బావిలోకి దూకింది. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు పిల్లలు మరణించారు. వీరిని తాళ్ళూరు సుజాత (30), జోషిక (12), సాత్విక్ (10)గా గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగానే సుజాత ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. అయితే సుజాత మాత్రం తన సూసైడ్ నోట్‌లో ‘నా భర్త మంచివాడు. కడుపు నొప్పికి తాళలేక చనిపోతున్నా. నా భర్తకు బిడ్డలు భారం కాకూడదని నాతో పాటు వారిని తీసుకెళుతున్నా’ అంటూ రాసింది.