త్వరలో టీడీపీలో చేరుతాం.. ఆనం బ్రదర్స్
posted on Nov 26, 2015 2:42PM

ఆనం బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీని వీడీ టీడీపీలోకి చేరుతున్నట్టు వార్తలు జోరుగానే వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలకి ఆనం బ్రదర్స్ బ్రేక్ వేసి తాము త్వరలో టీడీపీలోకి చేరుతామని స్పష్టం చేశారు. ఆనం రాంనారాయణరెడ్డి ఈరోజు పలు నియోజక వర్గాల కార్యకర్తలు, నేతలతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన ఉదయగిరి, కావలి, సర్వేపల్లి తదితర ప్రాంతాల కార్యకర్తల నుండి అభిప్రాయాలు సేకరించారు. ఈ నేపథ్యంలో ఆయన త్వరలో టీడీపీలో చేరుతామని ప్రకటించారు.
కాగా ఇప్పటికే పార్టీ ఎంట్రీకి సంబధించి టీడీపీ అధినేతతో ఆనం బ్రదర్స్ మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా వారు డిసెంబర్ 5 న టీడీపీ కండువా కప్పుకోవడానికి రంగం సిద్దం చేసుకున్నట్టు రాజకీయ వర్గాలు చర్చింటుకుంటున్నాయి.