బాబాయితో మా అమ్మకూ ప్రాణ హాని వుంది!
posted on Mar 9, 2020 6:52PM

ఆస్థి గొడవలే మా నాన చావుకు కారణం కావచ్చు. ''మా నాన్నకు బినామీ పేర్లతో చాలా ఆస్తులు ఉన్నాయి. ఆస్తుల విషయంలో బాబాయ్ శ్రవణ్‌కు ఆయనకు మధ్య గొడవలు ఉన్నాయి. మారుతీరావును శ్రవణ్ కొన్నిసార్లు కొట్టినట్లు నాకు తెలిసింది. మా నాన్న ఆస్తులపై నాకు ఆసక్తి లేదు. మా అమ్మకు కూడా ప్రాణాపాయం ఉండొచ్చు. శ్రవణ్ రెచ్చగొట్టడం వల్లే ప్రణయ్‌ను మారుతీరావు హత్య చేయించారు'' అని అమృత సంచలన ఆరోపణలు చేసింది.
మారుతీరావును కనీసం నా తండ్రి అని కూడా సంబోధించకుండా ''మారుతీరావు''అంటూ ఆమె మాట్లాడింది. ఈ క్రమంలో మారుతీరావుకు..ఆయన తమ్ముడు శ్రవణ్ కు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయనీ..ఆ తగాదాలతోనే మారుతీరావును శ్రవణ్ చాలాసార్లు కొట్టాడని..దాంతో భయపడిన మారుతీరావు ఎక్కుడో దాక్కున్నాడనీ అమృత ఆరోపణలు చేసింది.
అమృత ప్రణయ్ చేసిన ఆరోపణలపై మారుతీరావు తమ్ముడు శ్రవణ్ స్పందించారు. మా అన్న మారుతీరావుకు నాకు ఎటువంటి విభేదాలు లేవనీ..ఆస్తుల విషయంలో అస్సలు తగాలు లేనే లేవని స్పష్టంచేశారు. మా అన్న మారుతీరావుపై కేసులు ఉన్నాయి. దీంతో నేను కాస్త దూరంగా ఉన్నమాట నిజమే. కానీ విభేదాలు మాత్రం లేవని స్పష్టంచేశారు శ్రవణ్. అమృత నాపై చేసిన ఆరోపణలు వాస్తవం కాదనీ..ఆస్తుల కోసమే అమృత ఇటువంటి ఆరోపణలు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రవణ్.