ఒక్క నిమిషంలో ఛార్జింగ్...
posted on Apr 9, 2015 10:40AM
మనం ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలని అనుకున్నప్పుడే మొబైల్ లో ఛార్జింగ్ అయిపోతుంది. మళ్లీ అది ఛార్జ్ అవ్వాలంటే ఎలా లేదనుకున్నా ఓ 15 నిమిషాలు పడుతుంది. అలా కాకుండా ఒక్క నిమిషంలోనే రీఛార్జయ్యే అల్యూమినియం బ్యాటరీని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ప్రస్తుతం వాడుకలో ఉన్న లిథియం-ఐయాన్ బ్యాటరీలా పేలదని, అల్కాలైన్ బ్యాటరీలా పర్యావరణానికి హాని కలిగించదని యూనివర్సిటీ ప్రొఫెసర్ హోంగ్జీ దాయ్తె తెలిపారు. ఆ బ్యాటరీల కంటే ఈ అల్యూమినియం బ్యాటరీ చాలా తక్కువ ధర అని తెలిపారు. ఈ బ్యాటరీని స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లకు అనుగుణంగా మలుచుకోవచ్చని ఆయన చెప్పారు. మామూలు బ్యాటరీలకు రీఛార్జ్ సైకిల్ 1000 సార్లు మాత్రమే ఉంటుందని, దీనిని మాత్రం 7,500 సార్లు రీఛార్జ్ చేసుకోవచ్చని అన్నారు.